టెల్ అవివ్: జెరుసలాంలోని పవిత్రమైన టెంపుల్ మౌంట్(Temple Mount)ను ఇవాళ తెల్లవారుజామున తెరిచారు. ఇరాన్-అమెరికా వార్ వల్ల ఆ ఆలయ సమూహాన్ని మూసివేశారు. అయితే 40 రోజల బ్రేక్ తర్వాత మళ్లీ టెంపుల్ మౌంట్‌ను ఓపెన్ చేశారు. యూదులు, ముస్లింలు భారీ సంఖ్యలో ఆ ఆలయాన్ని ఇవాళ విజిట్ చేశారు. యూదులు, క్రైస్తవులు, ముస్లింలకు అత్యంత పవిత్రమైన స్థలంగా టెంపుల్ మౌంట్‌ను గుర్తిస్తారు. ఈస్ట్ జెరుసలాంలో ఉన్న అల్ అక్సా మసీదుకు వందల సంఖ్యలో ముస్లింలు హాజరయ్యారు. ప్రార్థనలు నిర్వహించారు. జెరుసలాంలోని ఓల్డ్ సిటీలో ఆ పవిత్ర మసీదు ఉన్నది.
అల్ హరామ్ అల్ షరీఫ్ కాంపౌండ్‌ను ఓపెన్ చేయగానే భారీ సంఖ్యలో పాలస్తీనా ముస్లింలు ఆ ప్రార్థనమందిరంలోకి ప్రవేశించారు. కొందరు ఆనందభాష్పాలు రాల్చారు. మళ్లీ మసీదులో ప్రార్థనలు చేయగలిగామని ఏడ్చేశారు. కొందరైతే పొర్లుదండాలు పెట్టారు. ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్‌పై అటాక్ ప్రారంభమైన నాటి నుంచే ఆల్ అక్సా మసీదును ఇజ్రాయెల్ పూర్తిగా మూసివేసింది. కేవలం మసీదు సిబ్బంది, జెరుసలాం ఇస్లామిక్ వక్ఫ్ సభ్యులు మాత్రమే అక్కడ ప్రార్థనలు చేశారు.
וכעת – הר הבית נפתח שוב ליהודים אחרי 40 יום בהם היה סגור בעקבות המלחמה@GLZRadio https://t.co/4XWtnGXffg pic.twitter.com/95y8nNsWcC
— נועם נקש || Noam Nakash (@nakash_noam) April 9, 2026
అల్ అక్సా మసీదులో ఈసారి రంజాన్ వేడుకలు నిర్వహించలేదు. ఈద్ ఉల్ ఫితర్ ప్రార్థనలు జరగలేదు. ఈస్ట్ జెరుసలాంను 1967లో ఇజ్రాయిల్ ఆక్రమించింది. అప్పటి నుంచి తొలిసారి అక్కడ ఈదుల్ పితర్ ప్రార్థనలు నిర్వహించలేదు. అయితే జెరుసలాంలోనే ఉన్న క్రైస్తవులు పవిత్ర కేంద్రం చర్చ్ ఆఫ్ ద హోఈ సిపల్చర్ను కూడా ఇజ్రాయిల్ అధికారులు మూసివేశారు.
వార్ జరుగుతున్న సమయంలో స్థానిక యూదులు ప్రభుత్వానికి అర్జి పెట్టుకున్నారు. వెస్ట్రన్ వాల్‌తో పాటు టెంపుల్ మౌంట్‌లో ప్రార్థనలు చేసుకునే వీలు కల్పించాలని వేడుకున్నారు. ప్రార్థనాల మందిరాలను ఓపెన్ చేయడం వల్ల భారీ సంఖ్యలో ముస్లింలు, యూదులు, క్రైస్తవులు .. జెరుసలాం ఓల్డ్ సిటీని ముంచెత్తే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ ప్రభుత్వం భారీ బందోబస్తుకు ఏర్పాటు చేస్తోంది.
నిజానికి జెరుసలాం ఓల్డ్ సిటీపై పట్టు కోసమే ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్ వార్ జరిగినట్లు కొన్ని కథనాలు చెబుతున్నాయి. యూదులు, క్రైస్తవులు, ముస్లింలకు పవిత్ర స్థలం కావడం వల్ల.. ఆ దేశాల మధ్య ఆధిపత్య పోరు సాగినట్లు భావిస్తున్నారు.