పారిస్: ఫ్రాన్స్‌లోని ఒక స్కూల్లో వ్యక్తి రెచ్చిపోయాడు. కత్తితో పలువురిపై దాడి చేశాడు. (Knife Attack) ఈ సంఘటనలో ఒక ఉపాధ్యాయుడు మరణించగా పలువురు గాయపడ్డారు. ఉత్తర ఫ్రాన్స్‌లోని అరాస్‌లో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం గంబెట్టా హైస్కూల్లోకి ఒక వ్యక్తి చొరబడ్డాడు. స్కూల్ ప్రాంగణంలో ఉన్న టీచర్లు, సెక్యూరిటీ గార్డుపై కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఒక ఉపాధ్యాయుడు మరణించగా మరో టీచర్, సెక్యూరిటీ గార్డు గాయపడ్డారు. ఈ సంఘటన నేపథ్యంలో విద్యార్థులు తలుపులు లాక్ చేసుకుని క్లాస్‌రూమ్స్‌లో ఉండిపోయారు.
కాగా, కత్తి దాడుల అనంతరం ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు కోసం ఉగ్రవాద వ్యతిరేక విభాగానికి అతడ్ని అప్పగించారు. స్కూల్ పూర్వ విద్యార్థి అయిన 20 ఏళ్ల వ్యక్తికి రాడికల్ ఇస్లామిజంతో సంబంధం ఉందని పేర్కొన్నారు. కత్తితో దాడికి ముందు ‘అల్లాహు అక్బర్’ అని అతడు అరిచినట్లు బీఎఫ్ఎం టీవీ పేర్కొంది. అయితే ఇజ్రాయెల్-హమాస్ వివాదానికి, ఈ సంఘటనకు ఏదైనా సంబంధం ఉందా అన్నదానిపై స్పష్టత లేదని ఫ్రెంచ్ పోలీస్ అధికారులు తెలిపారు.
మరోవైపు ఈ విషయం తెలిసిన వెంటనే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ అరాస్ వెళ్తున్నట్లు ఆయన కార్యాలయం తెలిపింది. అలాగే గురువారం దేశ ప్రజలనుద్దేశించి టీవీలో ప్రసంగించిన మాక్రాన్, ఫ్రెంచ్ ప్రజలు ఐక్యంగా ఉండాలని కోరారు. ఇజ్రాయెల్-హమాస్ సంఘర్షణకు దూరంగా ఉండాలని, ఈ వివాదాన్ని దేశంలోకి తీసుకురావద్దని అన్నారు.
Breaking: Terror in France
Knife attack at Gambetta High School in Arras…one teacher killed, two seriously injured; the terrorist has been arrested
The Minister of the Interior, Gérald Darmanin, announces that the perpetrator has been apprehended.
The "individual" reportedly… pic.twitter.com/Wil1pi93cw
— Amy Mek (@AmyMek) October 13, 2023