Tatto couple | అర్జెంటీనాకు చెందిన ఓ జంట 98 బాడీ మోడిఫికేషన్లు చేయించుకుని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లోకి చేరింది. కళ్లు, నాలుకతో పాటు శరీరం అంతటా పెద్ద సంఖ్యలో టాటూలను కలిగి ఉండటం ఈ జంట ప్రత్యేకత. విక్టర్ హ్యూగో పెరాల్టా, గాబ్రియేలా పెరాల్టా అనే ఈ జంట ప్రపంచంలోనే అత్యధిక శరీర మార్పులు చేసుకున్న రికార్డును కలిగి ఉన్నారు. భార్యాభర్తలిద్దరూ ముఖం నుంచి కాళ్ల వరకు పచ్చబొట్లు, ఇంప్లాంట్లు, కుట్లు వేసుకున్నారు.
విక్టర్, గాబ్రియేలా తమ శరీరం మొత్తం టాటూలతో పెయింట్ చేయించుకున్నారు. మొత్తం 50 బాడీ పియర్సింగ్‌లు, 8 మైక్రోడెర్మల్, 14 బాడీ ఇంప్లాంట్లు, 5 డెంటల్ ఇంప్లాంట్లు చేసుకున్నారు. అలాగే వారికి 4 ఇయర్ ఎక్స్పాండర్లు, 2 ఇయర్ బోల్ట్‌లు, ఫోర్క్డ్ నాలుక కూడా ఉన్నాయి. అంతే కాకుండా, ఈ జంట తమ కళ్ల లోపల కూడా టాటూలు వేయించుకుని పూర్తిగా నలుపు రంగులో మార్చుకోవడం విశేషం.
24 ఏండ్ల క్రితం మోటర్ సైకిల్ పోటీల సందర్భంగా కలుసుకున్న వీరిద్దరూ ప్రేమలో పడిపోయారు. అనంతరం పెండ్లి చేసుకుని 2009 నుంచి ఇలా ఒంటిపై టాటూలు వేసుకోవడం ప్రారంభించారు. ఇప్పటివరకు 20 దేశాలను చుట్టివచ్చిన ఈ జంట.. ఆయా దేశాల్లోని ఆచార వ్యవహారాలు తెలుసుకుంటూ కొత్త స్నేహితులను తమ జాబితాకు చేర్చకున్నారు. జీవితాన్ని ఎంజాయ్ చేయాలి.. ఆర్ట్‌ను ఎంజాయ్ చేయాలి.. ఈ టాటూల్లో ఎన్నో ఆలోచనలు మిలితమై ఉన్నాయని గర్వంగా చెప్తారు గాబ్రియేలా.