కాబూల్ గవర్నర్, మేయర్ సహా ఏడుగురి పేర్లు ప్రకటించిన తాలిబన్

కాబూల్: ఆఫ్థనిస్థాన్ను మరోసారి తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్, కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై చురుగ్గా కసరత్తు చేస్తున్నది. ఇందులో భాగంగా కాబూల్ గవర్నర్, మేయర్‌తోపాటు ఏడు ప్రభుత్వ పదవులను చేపట్టే వారి పేర్లను మంగళవారం ప్రకటించింది. విద్యాశాఖ అధిపతిగా సఖౌల్లా, ఉన్నత విద్య అధిపతిగా అబ్దుల్ బాకీ, యాక్టింగ్ అంతర్గత మంత్రిగా సదర్ ఇబ్రహీం, ఆర్థిక మంత్రిగా గుల్ అఘా, కాబూల్ కొత్త గవర్నర్‌గా ముల్లా షిరిన్, కాబూల్ మేయర్‌గా హమ్దుల్లా నోమాని, ఆఫ్ఘనిస్థాన్ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నజీబుల్లా నియమితులయ్యారు.
కాగా, ద ఆఫ్ఘనిస్థాన్ బ్యాంక్ (డీఏబీ) యాక్టింగ్ హెడ్‌గా హాబీ మహ్మద్ ఇద్రిస్‌ను నియమిస్తున్నట్లు తాలిబాన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ సోమవారం ట్వీట్ చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న బ్యాంకు సమస్యలను ఆయన పరిష్కరిస్తారని చెప్పారు. మరోవైపు ఆఫ్ఘన్లో అమెరికా దళాల ఉపంసంహరణ గడువు ఆగస్ట్ 31 సమీపిస్తుండటంతో ప్రభుత్వం ఏర్పాటుపై తాలిబన్ దృష్టిసారించింది. ఒకవేళ ఆ గడువు నాటికి తన బలగాలను అమెరికా వెనక్కి రప్పించకపోతే తీవ్ర పరిణామాలు జరుగుతాయని సోమవారం హెచ్చరించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

