కాబూల్: ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం ఆ దేశ ఎన్నికల సంఘాన్ని రద్దు చేసింది. ఆఫ్ఘన్‌లోని రెండు ఎన్నికల కమిషన్లతో పాటు శాంతి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలను రద్దు చేసినట్లు తాలిబన్ అధికారి ఆదివారం తెలిపారు. దేశంలోని స్వతంత్ర ఎన్నికల సంఘం, ఎన్నికల ఫిర్యాదు కమిషన్‌ను రద్దు చేసినట్లు తాలిబన్ ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వానికి చెందిన డిప్యూటీ అధికార ప్రతినిధి బిలాల్ కరీమీ చెప్పారు. ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రస్తుత పరిస్థితికి అవి అనవసర సంస్థలని ఆయన వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఎన్నికల సంఘాల అవసరం ఉంటే, తాలిబన్ ప్రభుత్వం వాటిని పునరుద్ధరిస్తుందని అన్నారు.