డమాస్కస్: సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ (Bashar al-Assad) మరణించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన ప్రయాణించిన విమానం రాడార్ నుంచి అదృశ్యమైంది. దీంతో దేశం నుంచి పారిపోతుండగా ఆ విమానాన్ని కూల్చివేయడం లేదా కూలిపోయినట్లుగా అనుమానిస్తున్నారు. సిరియా రాజధాని డమాస్కస్‌ను రెబల్ దళాలు స్వాధీనం చేసుకున్న తరుణంలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం డమాస్కస్ ఎయిర్పోర్ట్ నుంచి సిరియన్ ఎయిర్ విమానం బయలుదేరింది. అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ఈ విమానంలో పారిపోయినట్లు సమాచారం.
కాగా, సిరియన్ ఎయిర్ విమానం ఇల్యుషిన్ Il-76టీ తొలుత సిరియా తీర ప్రాంతం వైపు వెళ్లినట్లు ఆన్లైన్ ఫ్లైట్ ట్రాకర్ ఫ్లైట్రాడార్24.కామ్ డేటా ద్వారా తెలిసింది. ఆ విమానం అకస్మాత్తుగా మార్గాన్ని మార్చుకున్నది. వ్యతిరేక దిశలో ప్రయాణించిన ఆ విమానం రెబల్స్‌కు పట్టున్న హోమ్స్ నగరం సమీపంలో రాడార్ నుంచి అదృశ్యమైంది. ఆ సమయంలో 3,650 మీటర్ల ఎత్తు నుంచి 1,070 మీటర్లకు ఆ విమానం పడిపోయినట్లు ఫ్లైట్ డేటా సూచించింది.
ఈ నేపథ్యంలో ఆ విమానాన్ని రెబల్స్ కూల్చివేసి ఉంటారని, లేదా ఆ విమానం ఆ ప్రాంతంలో కూలిపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ విమాన ప్రమాదంలో బషర్ అల్ అసద్ మరణించినట్లు పలు వార్తా సంస్థలు పేర్కొన్నాయి. అయితే సిరియా అధికారులు దీనిని ధృవీకరించలేదు.
Here is the screen recording on Flight Radar of SYR9218 going off the radar. Allegedly, with Assad on board. #Syria pic.twitter.com/cK3Dd3yLjI
— SpiltyTea (@Spiltea) December 8, 2024