Syria earthquake : తుర్కియే, సిరియా సరిహద్దుల్లో సోమవారం తెల్లవారుజామున సంభవించిన భూకంపం రెండు దేశాల్లో పెను విషాదాన్ని మిగిల్చింది. ఆ రెండు దేశాల్లోని భూకంప ప్రభావిత ప్రాంతాలు మరుభూమిలా మారాయి. ఎటు చూసినా కూలిన భవన శిథిలాలు, వాటి కింద నుంచి కుప్పలు, తెప్పలుగా బయటపడుతున్న మృతదేహాలు చూసేవారిలో కన్నీళ్లు కట్టలు తెంచుకునేలా చేస్తున్నాయి.
ఇక, శిథిలాల కింద చిక్కుకుని తీవ్ర గాయాలతో బయటపడుతున్న వారి పరిస్థితి వర్ణణాతీతం. కాళ్లు చేతులు విరిగి కొందరు, తలలు పగిలి మరికొందరు, అంతకంటే తీవ్రంగా గాయపడి అపస్మార స్థితిలో ఇంకొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అలా భవన శిథిలాల కింద చిక్కుకుని ముఖంపై స్వల్ప గాయాలతో బయటపడిన ఓ చిన్నారి పరిస్థితి చూస్తే కడుపు తరుక్కుపోతుంది.
ఎందుకంటే.. తీవ్ర భూకంపం ధాటికి ఆ పసిబిడ్డ కుటుంబం నివసిస్తున్న భవనం పేకమేడలా కుప్పకూలింది. ఈ ఘటనలో ఆ పాప తల్లి, తండ్రి, తోడబుట్టిన అన్న శిథిలాల కిందపడి ప్రాణాలు కోల్పోయారు. కానీ ఆ చిన్నారి మాత్రం స్వల్ప గాయాలతో బయటపడింది. అయితే, నిన్నమొన్నటి వరకు అమ్మానాన్నల చేతిలో అల్లారుముద్దుగా పెరిగిన బిడ్డ.. ఇకపై అనాథ అనే విషయం తలుచుకుంటేనే గుండెను పిండేసినట్లుగా అనిపిస్తున్నది.
So much sadness, heartbreak and devastation.
This precious angel was saved from the rubble of a building but lost her entire family in the Syria earthquake.
How to help victims:
@UNICEF @CAREGlobal @MSF #Turkey #Syria #earthquake pic.twitter.com/EXaTAjpFoA— Dr. Nina Ansary (@drninaansary) February 7, 2023