Sunita Williams | వాషింగ్టన్, జనవరి 30: నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) నుంచి బయటకు వచ్చి స్పేస్‌వాక్ చేశారు. ఐఎస్ఎస్కు సంబంధించిన నిర్వహణ పనులు, శాస్త్రీయ పరిశోధనల కోసం అవసరమైన నమూనాల సేకరణ కోసం వీరు ఐఎస్ఎస్ నుంచి బయటకు వెళ్లారు.
ఐఎస్ఎస్తో భూమికి ఉండే సమాచార వ్యవస్థను ఆధునికీకరించేందుకు వీలుగా ఇప్పటికే ఉన్న రేడియో ఫ్రీక్వెన్స్ యాంటెన్నాను వీరు తొలగించారు. అంతరిక్ష కేంద్రానికి బయటి వైపు సూక్ష్మజీవులు మనగలుగుతున్నాయా అనేది తెలుసుకునేందుకు ఉపయోగపడే నమూనాలను సేకరించారు. కాగా, వారం రోజుల అంతరిక్ష యాత్ర కోసం గత ఏడాది జూన్‌లో బోయింగ్ స్టార్‌లైనర్ ద్వారా సునీతా విలియమ్స్, విల్మోర్ ఐఎస్ఎస్కు వెళ్లిన సంగతి తెలిసిందే.