వాషింగ్టన్, మార్చి 18: డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌లో మరో ఇద్దరు వ్యోమగాములతో కలిసి సునీతా విలియమ్స్, విల్మోర్లు భూమి మీదకు ప్రయాణమయ్యారు. వీరు బయల్దేరిన వ్యోమనౌక బుధవారం ఉదయం 3.27 గంటలకు ఇక్కడి ఫ్లోరిడా సముద్ర తీర ప్రాంతంలోని జలాల్లో ‘స్ప్లాష్‌డౌన్’ (వ్యోమగాములున్న క్యాప్సుల్ నీటిలో పడటం) అవుతుందని నాసా అధికారికంగా తెలిపింది. సముద్రంపై సిద్ధంగా ఉన్న రికవరీ టీమ్స్ వ్యోమగాములున్న చోటకు వెళ్లి.. వారిని సురక్షితంగా తీరానికి తీసుకొస్తారు. అనంతరం వారిని హ్యూస్టన్‌లోని నాసా జాన్సన్ స్పేస్ సెంటర్‌కు తీసుకెళ్తారు. అక్కడ కొద్ది రోజులపాటు ఉంచి.. వైద్య చికిత్సలు జరుపుతారు. కొన్ని నెలలపాటు అంతరిక్షంలో ఉండటం వల్ల, వారి శరీరంలో అనేక మార్పులు వస్తాయి. కండరాలు, ఎముకుల బలం ప్రభావితమవుతుంది. దృష్టిలోపం కూడా రావొచ్చు. దీంతో నాసా 45 రోజుల రిహాబిలిటేషన్ ప్రోగ్రాంలో వ్యోమగాములు తిరిగి శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది.