పాకిస్థాన్‌లో ఆత్మాహుతి బాంబు దాడి.. పోలీస్ మృతి, పలువురికి గాయాలు
సూసైడ్ బాంబ్ బ్లాస్ట్ గురించి తెలిసిన వెంటనే పాకిస్థాన్‌కు చెందిన ప్రత్యేక ఉగ్రవాద నిరోధక దళాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి.
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఈ సంఘటనలో ఒక పోలీస్ మరణించగా, నలుగురు పోలీసులు సహా ఆరుగురు గాయపడ్డారు. పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లో శుక్రవారం ఉదయం ఈ సంఘటన జరిగింది. ఐ-10/4 సెక్టార్లో దంపతులు ప్రయాణిస్తున్న క్యాబ్‌పై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. తనిఖీ కోసం ఆ కారును ఆపారు. దీంతో ఆ జంట వాహనం నుంచి కిందకు దిగింది. అనంతరం ఒక వ్యక్తి మళ్లీ కారు లోపలకు వెళ్లి తనను తాను పేల్చుకున్నాడు. ఈ పేలుడులో ఈగిల్ స్క్వాడ్‌కు చెందిన ఒక పోలీస్ అధికారి చనిపోయాడు. మరో నలుగురు పోలీసులు, ఇద్దరు పౌరులు గాయపడ్డారు.
కాగా, సూసైడ్ బాంబ్ బ్లాస్ట్ గురించి తెలిసిన వెంటనే పాకిస్థాన్‌కు చెందిన ప్రత్యేక ఉగ్రవాద నిరోధక దళాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. ఈ సంఘటన నేపథ్యంలో ఆ మార్గంలో వెళ్లే వాహనాలను మరో మార్గం వైపు మళ్లించారు. మరోవైపు ఆత్మాహుతి బాంబు పేలుడుపై ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ స్పందించలేదు. అయితే ఈ ఏడాది జూన్‌లో ప్రభుత్వంతో కుదిరిన నిరవధిక కాల్పుల విరమణను నిషేధిత తెహ్రీక్ ఇ తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ) రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఆ సంస్థపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
https://twitter.com/IslamabadViews/status/1606175642499809280?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1606175642499809280%7Ctwgr%5E210e5931e0004e2e87b409e8a775ab115198d98c%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.indiatoday.in%2F
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

