Student visas | కఠిన చర్యలు.. ఆమెరికాలో 6 వేల విద్యార్థి వీసాలు రద్దు
Student visas | అమెరికా (USA) లో వీసా నిబంధనలు ఉల్లంఘించిన విద్యార్థులపై అక్కడి అధికార యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంటోంది. తాజాగా 6 వేల మంది అంతర్జాతీయ విద్యార్థుల వీసాల (Student Visas) ను రద్దు చేసినట్లు ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ తన కథనంలో పేర్కొంది.
Student visas : అమెరికా (USA) లో వీసా నిబంధనలు ఉల్లంఘించిన విద్యార్థులపై అక్కడి అధికార యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంటోంది. తాజాగా 6 వేల మంది అంతర్జాతీయ విద్యార్థుల వీసాల (Student Visas) ను రద్దు చేసినట్లు ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ తన కథనంలో పేర్కొంది. అమెరికా విదేశాంగశాఖ ఈ విషయాన్ని వెల్లడించినట్లు ఆ మీడియా కథనం తెలిపింది. ఆ 6 వేల మందిలో 4 వేల మంది దేశ చట్టాలను ఉల్లంఘించడం, దాడులు, మత్తులో డ్రైవింగ్, దోపిడీలకు పాల్పడటం లాంటివి చేసినట్లు తెలుస్తోంది.
అమెరికా చట్టాల్లోని ఐఎన్ఏ 3బీ కింద ఉగ్రవాదానికి పాల్పడిన దాదాపు 300 మంది కూడా ఆ జాబితాలో ఉన్నారు. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభంలో ఈ వీసాల రద్దు వ్యవహారం వెలుగులోకి రావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దేశంలో ఉన్నత విద్యావ్యవస్థను పునర్వ్యవస్థీకరించే పనిలోపడ్డారు. ప్రధాన విశ్వవిద్యాలయాలను లక్ష్యంగా చేసుకొని తీవ్రస్థాయిలో పాలసీల మార్పులు చేపట్టారు.
ఇవి అంతర్జాతీయ విద్యార్థులపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. తొలుత జనవరిలో యాంటీ సెమిటిజమ్ (యూదులపై వ్యతిరేకత) ను అరికట్టేలా బిల్లును పాస్ చేశారు. అంతర్జాతీయ విద్యార్థులు పాలస్తీనాకు మద్దతుగా ఆందోళనలు చేపడితే.. నూతన ఆదేశాల ప్రకారం వారిని దేశ బహిష్కరణ చేయవచ్చు. విదేశీ విద్యార్థులకు కొత్త ఇంటర్వ్యూల షెడ్యూల్‌ను నిలిపివేస్తూ జూన్‌లో ట్రంప్ కార్యవర్గం నిర్ణయం తీసుకొంది.
అనంతరం సోషల్ మీడియా వెట్టింగ్‌ను కఠినతరం చేశారు. ఫారెన్ స్టూడెంట్స్ కచ్చితంగా వారి సామాజిక మాధ్యమ ఖాతాలు బహిర్గతం చేయాలని ఆదేశించారు. విద్యార్థుల పోస్టులు, కామెంట్లు, లైక్‌లను అమెరికా అధికారులు పరిశీలించి, వారు జాతీయ భద్రతకు ముప్పు కాదని భావిస్తే మాత్రమే వీసా ప్రక్రియలో ముందుకు వెళ్తారు. ఇక కీలక విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలకు కేటాయించిన నిధుల్లో కోత విధించారు.
క్యాంపస్‌లలో పాలస్తీనా అనుకూల ఆందోళనల్లో పాల్గొన్న చాలామంది విదేశీ విద్యార్థులను అరెస్టు చేయించారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయం అంతర్జాతీయ విద్యార్థులను చేర్చుకోకుండా బ్లాక్ చేశారు. ఈ క్రమంలో ట్రంప్ కార్యవర్గం, విశ్వవిద్యాలయం మధ్య న్యాయపోరాటం మొదలైంది. గత ఏడాది గణాంకాల ప్రకారం దాదాపు 10 లక్షల మందికి పైగా అంతర్జాతీయ విద్యార్థులు అమెరికాలో చదువుతున్నారు. వారి నుంచి దాదాపు 43.8 బిలియన్ డాలర్లు అమెరికాకు లభించాయని NAFSA అసోసియేషన్ వెల్లడించింది.
Read More >>
అది ఫేక్ యాప్.. బీ కేర్‌ఫుల్.. బలగాలకు సీఆర్పీఎఫ్ అలర్ట్
‘ఇది పరిహాసమా.. జిల్లా మొత్తం రాసిస్తున్నారా?’.. అసోం సర్కారుపై గౌహతి హైకోర్టు ఫైర్
సోషల్ మీడియాలో లైకులు, కామెంట్లతో మనిషి విలువను కొలువద్దు : ఐశ్వర్యారాయ్
భారత్-చైనా సరిహద్దులు ప్రశాంతం : అజిత్ దోవల్
మెక్సికో అమ్మాయితో గన్నవరం కుర్రాడి పెళ్లి.. పెళ్లి ఫొటోలు వైరల్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

