Japan: జపాన్‌లో భూకంపం.. 9 మందికి గాయాలు
Japan: జపాన్‌లో ఇవాళ బలమైన భూకంపం నమోదు అయ్యింది. సౌత్‌వెస్ట్ ప్రాంతంలో ఆ ప్రకంపన వచ్చింది. ఈ భూకంపం వల్ల సుమారు 9 మంది స్వల్పంగా గాయపడ్డారు. దాని ధాటికి నీటి పైపులు డ్యామేజ్ అయ్యాయి. కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి.
టోక్యో: జపాన్(Japan)లో ఇవాళ బలమైన భూకంపం నమోదు అయ్యింది. సౌత్‌వెస్ట్ ప్రాంతంలో ఆ ప్రకంపన వచ్చింది. ఈ భూకంపం వల్ల సుమారు 9 మంది స్వల్పంగా గాయపడ్డారు. దాని ధాటికి నీటి పైపులు డ్యామేజ్ అయ్యాయి. కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. అయితే సునామీ వచ్చే ప్రమాదం ఏమీ లేదని అధికారులు చెప్పారు. షికోకో దీవికి పశ్చిమ దిక్కున 6.6 తీవ్రతో భూకంపం నమోదు అయ్యింది. షికోకు, క్యుషు దీవుల మధ్య భూకంప కేంద్రం ఉన్నట్లు భావిస్తున్నారు. సముద్ర ఉపరితలానికి 50 కిలోమీటర్ల లోతులో భూకంపం నమోదు అయ్యింది. షికోకు రైల్వే సర్వీసలను కొన్ని ప్రాంతాల్లో రద్దు చేశారు. ఇకాటా న్యూక్లియర్ కాంప్లెక్స్ వద్ద విద్యుత్త సరఫరాలో అంతరాయం ఏర్పడింది. సుకుమో ప్రాంతంలో సుమారు 23 మందిని పాక్షికంగా తరలించారు. ఇవాళ భూకంపం వచ్చిన ప్రాంతంలో రానున్న 30 ఏళ్లలో రిక్టర్ స్కేల్‌పై 8 తీవ్రతతో భూకంపం వచ్చే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fake Potatoes | మార్కెట్లో విరివిగా కల్తీ ఆలుగడ్డలు.. గుడ్డిగా కొనుగోలు చేస్తే అంతే సంగతి..!
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

