Nigeria : ఆఫ్రికా దేశమైన నైజీరియాలో దారుణం జరిగింది. ఫెర్టిలిటీ కోసం ఒరాముడు అనే కమ్యూనిటీ జరుపుకొనే అల్యూ డు అనే ఫెస్టివల్లో కొందరు దుండగులు దారుణానికి పాల్పడ్డారు. దీన్ని రే..ప్ ఫెస్టివల్ అంటూ కొందరు దుండగులు మహిళలపై దారుణాలకు పాల్పడ్డారు. నైజీరియాలోని డెల్టా స్టేట్లో గత మార్చిలో ఈ ఘటన జరిగింది. అంతర్జాతీయ మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం.. కొందరు వ్యక్తులు రే..ప్ ఫెస్టివల్ పేరుతో అక్కడ దారుణాలకు పాల్పడ్డారు.
స్థానిక యూనివర్సిటీకి చెందిన విద్యార్థినులతోపాటు మరికొందరు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడ్డారు. వీధులు, బహిరంగ ప్రదేశాల్లో ఉన్న మహిళల్ని వేధించారు. వారి దుస్తులు లాగి లైంగిక దాడికి పాల్పడ్డారు. కొందరిని నగ్నంగా చేశారు. అనేక హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. పెద్ద వయసు వారితోపాటు యువకులు కూడా ఈ దారుణానికి పాల్పడిన వారిలో ఉన్నారు. చాలామంది గుమిగూడి, గట్టిగా అరుస్తూ ఈ దాడులు చేశారు. ఇదంతా బహిరంగంగా, వీధుల్లో జరగడం విశేషం. కొంతమంది మహిళలపై దాడి జరగడంతో వారు ఆస్పత్రుల్లో చేరి, చికిత్స తీసుకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇటీవల వైరల్గా మారాయి.
దీంతో ఈ ఘటన షాక్కు గురి చేసింది. ఒక బాధిత మహిళ తను వారి నుంచి ఎదుర్కొన్న భయానక అనుభవం గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తమను కొందరు వ్యక్తులు చుట్టుముట్టి, దుస్తులు విప్పేసి లైంగిక దాడికి పాల్పడ్డారని ఆమె తెలిపారు. ఇప్పటికీ దీనికి సంబంధించి తాను మానసికంగా, శారీరకంగా బాధపడుతున్నట్లు ఆమె తెలిపారు. ఈ ఘటనపై డెల్టా స్టేట్ పోలీసులు మాట్లాడుతూ, ఈ నేరానికి పాల్పడిన కొందరు దుండగుల్ని అరెస్టు చేసినట్లు తెలిపారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మరికొందరు నిందితుల్ని గుర్తిస్తామన్నారు. నిందితులు అందరినీ గుర్తించి, అరెస్టు చేస్తామన్నారు.