Starbucks | వివాదాస్పద యాడ్ : ట్రెండింగ్‌లో బాయ్‌కాట్ స్టార్‌బక్స్
సరికొత్త యాడ్‌తో ముందుకొచ్చిన ప్రముఖ కాఫీ బ్రాండ్ స్టార్‌బక్స్ (Starbucks) చిక్కుల్లో పడింది. వివాదాస్పద యాడ్‌తో బాయ్‌కాట్ స్టార్‌బక్స్ ట్రెండ్ అవుతోంది
న్యూఢిల్లీ : సరికొత్త యాడ్‌తో ముందుకొచ్చిన ప్రముఖ కాఫీ బ్రాండ్ స్టార్‌బక్స్ (Starbucks) చిక్కుల్లో పడింది. వివాదాస్పద యాడ్‌తో బాయ్‌కాట్ స్టార్‌బక్స్ ట్రెండ్ అవుతోంది. ట్రాన్స్జెండర్ల హక్కులపై ఫోకస్ చేస్తూ మే 10న స్టార్‌బక్స్ విడుదల చేసిన నూతన ప్రకటన వివాదాలకు కేంద్ర బిందువైంది. ఇట్ స్టార్ట్స్ విత్ యువర్ నేమ్ అనే ట్యాగ్‌లైన్, హ్యాష్‌ట్యాగ్‌తో స్టార్‌బక్స్ ఇండియా చేపట్టిన క్యాంపెయిన్ బెడిసికొట్టింది. ఇక ఈ ప్రకటన విషయానికి వస్తే రెండు నిమిషాల నాలుగు సెకండ్ల వ్యవధి కలిగిన ఈ క్లిప్‌లో స్టార్‌బక్స్ అవుట్‌లెట్‌లో పేరెంట్స్ కూర్చుని తమ కొడుకు కోసం వేచిచూస్తుంటారు.
Your name defines who you are – whether it's Arpit or Arpita. At Starbucks, we love and accept you for who you are. Because being yourself means everything to us. #ItStartsWithYourName. 💚 pic.twitter.com/DKNGhKZ1Hg
— Starbucks India (@StarbucksIndia) May 10, 2023
తమ కుమారుడు స్త్రీగా మారడాన్ని తండ్రి అంగీకరించేందుకు ఇబ్బంది పడుతుండటం కనిపిస్తుంది. తన కొడుకు అర్పిత్ కాస్తా అర్పితగా మారడం ఆయన జీర్ణించుకోలేకపోతాడు. కొద్దిసేపటికి అర్పిత అక్కడకు చేరగానే కొద్దిగా ముభావంగా కనిపించిన తండ్రి ఆపై అందరికీ కాఫీ ఆర్డర్ చేయడం, అర్పిత చేయిని తడమంతో ఆమె స్వేచ్ఛను అంగీకరించినట్టు సంకేతాలు పంపుతాడు. స్టార్‌బక్స్‌లో మీరు అర్పిత్ లేదా అర్పిత మీ పేరేదైనా మిమ్మల్ని మీరుగా అంగీకరించి ప్రేమ కురిపిస్తాం అని స్టార్‌బక్స్ అధికారిక ట్విట్టర్ పేజ్‌లో ట్వీట్ చేశారు.
స్టార్‌బక్స్ మార్కెటింగ్ క్యాంపెయిన్ 48 గంటల్లోనే వైరల్ అయింది. ఈ యాడ్‌కు 25 లక్షల ట్విట్ వ్యూస్, 5.3 లక్షల వీడియో వ్యూస్ లభించాయి. ట్రాన్స్‌జెండర్ హక్కులపై ఫోకస్ చేసిన క్యాంపెయిన్‌పై సోషల్ మీడియాలో హాట్ డిబేట్ సాగింది. ఈ క్యాంపెయిన్ సరైనదని కొందరు సమర్ధించగా మరికొందరు ఇలాంటి విషయాలను సెన్సిటివ్‌గా డీల్ చేయాలని అసలు ముందు ఈ క్యాంపెయిన్ అవసరమా అని పలువురు యూజర్లు ప్రశ్నించారు. ఇక బాయ్‌కాట్ స్టార్‌బక్స్ హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది.
Read More
YouTuber | వ్యూస్ కోసం విమానాన్ని కూల్చిన యూట్యూబర్‌కు చిక్కులు : 20 ఏండ్లు జైలు శిక్ష విధించే ఛాన్స్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

