సెంట్రల్ కొలంబియాలో జరిగిన బుల్ ఫైట్‌లో విషాదం నెలకొంది. బుల్‌ఫైట్ రింగ్ వద్ద ఒక చెక్క స్టాండ్‌లో కొంత భాగం కూలిపోవడంతో నలుగురు మృతిచెందారు. 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ చెక్క స్టాండ్పైనుంచి మనుషులు పిట్టల్లా నేలపై పడ్డారు. ఈ భయానక వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
టోలిమా రాష్ట్రంలోని ఎల్ ఎస్పినాల్ నగరంలోగల ఒక స్టేడియంలో “కొర్రలేజా” అని పిలిచే సాంప్రదాయ కార్యక్రమంలో భాగంగా బుల్‌ఫైట్ నిర్వహించారు. రింగ్‌లోకి ఎద్దులు ప్రవేశించే సమయంలో ఈ విషాద ఘటన జరిగింది. చెక్కస్టాండ్పై ఉన్న ప్రజలు గట్టిగా అరుస్తూ కేకలు వేస్తున్నారు. ఇదే సమయంలో ఆ స్టాండ్‌లో కొంతభాగం విరిగిపోయింది. దీంతో దానిపై ఉన్నవారందరూ రింగ్‌లో పడ్డారు. ఈ ఘటనలో మొత్తం 300 మంది దాకా గాయపడగా, 30 మందికి తీవ్రగాయాలయ్యాయి. నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతిచెందినవారిలో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు, ఒక మైనర్ ఉన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూస్తున్నామని టోలిమా గవర్నర్ జోస్ రికార్డో ఒరోజ్కో స్థానిక బ్లూ రేడియోతో చెప్పారు.
Four killed and about 70 injured after a part of a stand collapsed at a bullring (during bullfight) in the town of El Espinal, Colombia pic.twitter.com/vbjtXlv959
— hurriyatpk (@hurriyatpk1) June 27, 2022