కొలంబో, సెప్టెంబర్ 20: ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో శనివారం దేశాధ్యక్ష పదవికి ఎన్నిక జరగనుంది. మొత్తం 38 మంది అభ్యర్థులు ఈ ఎన్నికలో పోటీ పడుతున్నారు. దాదాపు 1.70 కోట్ల మంది ప్రజలు నేరుగా ఓటు వేసి అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. ఒక్కో ఓట రు ముగ్గురికి ఓటు వేయవచ్చు. 50% ఓట్లు దక్కి ంచుకున్న అభ్యర్థి విజయం సాధిస్తారు.
శ్రీలంక అధ్యక్ష పదవి కోసం 38 మంది పోటీ పడుతున్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం ప్రస్తుత అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, అనుర కుమార దిస్సనాయకే, సజిత్ ప్రేమదాస మధ్యనే నెలకొన్నది.