లంకలో సోషల్ మీడియాపై నిషేధం..
Sri Lanka | ఆర్థిక సంక్షోభంలో పూర్తిగా కూరుకుపోయిన శ్రీలంకలో (Sri Lanka)ప్రజా నిరసనలు ఉద్ధృతమయ్యాయి. దీంతో వాటిని నిలువరించడానికి ఇప్పటికే దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి అమలుచేస్తున్న ప్రభుత్వం.. తాజాగా సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించింది.
కొలంబో: ఆర్థిక సంక్షోభంలో పూర్తిగా కూరుకుపోయిన శ్రీలంకలో (Sri Lanka)ప్రజా నిరసనలు ఉద్ధృతమయ్యాయి. దీంతో వాటిని నిలువరించడానికి ఇప్పటికే దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి అమలుచేస్తున్న ప్రభుత్వం.. తాజాగా సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించింది. ఈ మేరకు శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆదేశాలు జారీచేసింది. దీంతో దేశంలో ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్, వాట్సప్, యూట్యూబ్ సేవలు నిలిచిపోయాయి. తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
దేశంలో నిత్యావసరాల ధరలు చుక్కలను తాకడంతో అధ్యక్షుడు రాజపక్సకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలకు దిగారు. దీంతో దేశవ్యాప్త ఎమర్జెన్సీ విధించారు. భద్రతా బలగాలకు అపరిమిత అధికారాలనిచ్చారు. నిరసన ప్రదర్శనలు ఎవరు నిర్వహించినా అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల భద్రత, అత్యవసర సేవల కోసం, నిత్యావసర వస్తువుల సరఫరాలో ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకే ఎమర్జెన్సీ నిర్ణయం తీసుకొన్నట్టు రాజపక్స పేర్కొన్నారు. ఎమర్జెన్సీ శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చింది.
దీంతోపాటు 36 గంటల దేశవ్యాప్త కర్ఫ్యూ విధించారు. కర్ఫ్యూ శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ఇది అమల్లోకి వచ్చింది. సోమవారం ఉదయం 6 గంటల వరకు అమల్లో ఉంటుంది. నిత్యావసరాల కోసం తప్ప ప్రజలు దేనికీ బయటకు రావొద్దని అధికారులు ఆదేశించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

