Viral Video: ట్రైలర్ లారీని ఢీకొట్టిన రైలు.. తర్వాత ఏం జరిగిందంటే?
రోడ్డుపై భారీగా మంచు పేరుకుపోయింది. దీంతో అక్కడ ఉన్న రైలు పట్టాలు వాహనాల డ్రైవర్లకు కనిపించలేదు.
వాషింగ్టన్: అమెరికాలో అసాధరణ వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయికి పడిపోవడంతో పలు ప్రాంతాలు మంచుతో నిండిపోయాయి. ఈ నేపథ్యంలో ఊహించని ప్రమాదాలు జరుగుతున్నాయి. మంచు వల్ల రైల్వే ట్రాక్ కనిపించకపోవడంతో రైలు పట్టాలు దాటుతూ వాహనాలు అటూ ఇటూ వెళ్లసాగాయి. ఇంతలో వేగంగా వచ్చిన ఒక రైలు ట్రైలర్ లారీని ఢీకొట్టింది. దీంతో లోడ్‌తో ఉన్న ట్రైలర్ లారీ ముందు భాగం నుంచి విడిపోయింది. అదృష్టవశాత్తూ లారీ డ్రైవర్‌కు ప్రాణాపాయం తప్పింది.
కాగా, విస్కియస్ వీడియోస్ అనే యూజర్ ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇందులో ఫెడెక్స్ రవాణా సంస్థకు చెందిన రెండు కార్గో లారీలు ఎదురెదురుగా వెళ్తుంటాయి. అయితే రోడ్డుపై భారీగా మంచు పేరుకుపోయింది. దీంతో అక్కడ ఉన్న రైలు పట్టాలు వాహనాల డ్రైవర్లకు కనిపించలేదు. ఫెడెక్స్‌కు చెందిన ఒక కార్గో లారీ వెళ్తుండగా పట్టాలపై వేగంగా వచ్చిన రైలు దానిని ఢీకొట్టింది. దీంతో ట్రైలర్ భాగం విడిపోయింది. డ్రైవర్ ఉన్న భాగం మరో దిశకు తిరిగింది. అదృష్టవశాత్తు ఫెడెక్స్ సంస్థకు చెందిన లారీ ముందు భాగంలో ఉన్న డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఒక వాహనంపై ఉన్న కెమేరాలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు కూడా ఈ వీడియో చూసి షాక్ అయ్యారు.
https://twitter.com/ViciousVideos/status/1609067074642403329?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1609067074642403329%7Ctwgr%5Ef012a964794c941609a301a62f7eeb936371cd45%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.india.com%2Fviral%2Fviral-video-speeding-train-trailer-truck-driver-shocking-fedex-railgadi-ka-accident-5832332%2F
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gautam Prasad Yallapu | గౌతమ్ ప్రసాద్ యల్లపు దర్శకత్వంలో ‘ప్రొడక్షన్ నంబర్ 1’ చిత్రం.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం!
Psoriasis | సోరియాసిస్ అంటే ఏమిటి.. ఎలా వస్తుంది.. లక్షణాలు ఎలా ఉంటాయి..?
పులివెందుల పులినని చెప్పుకునే జగన్.. ఓటు వేయకుండానే పిరికిపందలా పారిపోయారు.. అచ్చెన్నాయుడు ఎద్దేవా
అన్నాచెల్లెలుగా పేర్కొంటూ అద్దె ఇంట్లో నివసించిన జంట.. ఉరి వేసుకున్న యువకుడు, ప్రియురాలు గదిలో నిర్బంధం
కట్టిపడేసే చూపులు.. కిర్రెక్కించే పోజులు.. బ్లూ శారీలో ప్రణవి మనుకొండ హాట్ ఫొటోలు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

