మాడ్రిడ్, అక్టోబర్ 13: స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లోని లాపాజ్ హాస్పిటల్ వైద్యులు అరుదైన ఘనత సాధించారు. ఏడాదిన్నర పాపకు పెద్దపేగు మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. ప్రపంచంలో ఈ తరహా ఆపరేషన్ ఇదే మొదటిది కావడం గమనార్హం.
గుండెనొప్పితో మరణించిన దాత నుంచి సేకరించిన పెద్దపేగును పాపకు అమర్చారు. ఎమ్మా అనే పేరుగల ఆ పాప సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జి అయ్యి ఇంటికి వెళ్లిపోయిందని దవాఖాన ఓ ప్రకటనలో తెలిపింది. పాప పుట్టిన నెలలోపే పెద్దపేగు సమస్య బయటపడింది. ఆమెకు పెద్దపేగు మాత్రమే కాకుండా కాలేయం, ప్లీహం, క్లోమగ్రంథి కూడా అమర్చాల్సి వచ్చింది.