Starship: హిందూ మహాసముద్రంలో పేలిన స్టార్‌షిప్.. వీడియో
Starship: ఎలన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ కంపెనీ.. మూడవ జనరేషన్‌కు చెందిన స్టార్‌షిప్ వీ3ను విజయవంతంగా పరీక్షించింది. చరిత్రలోనే అతి పెద్ద, శక్తివంతమైన రాకెట్‌ను టెస్ట్ చేసింది. అయితే ఆ స్టార్‌షిప్ రాకెట్.. హిందూ మహాసముద్రంలో దిగిన తర్వాత ప్లాన్ ప్రకారమే పేలింది.
టెక్సాస్: బిలియనీర్ ఎలన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ కంపెనీ .. మూడవ జనరేషన్‌కు చెందిన స్టార్సిప్(Starship) వీ3ను విజయవంతంగా పరీక్షించింది. చరిత్రలోనే అతి పెద్ద, శక్తివంతమైన రాకెట్‌ను టెస్ట్ చేశారు. శుక్రవారం సుమరు గంటకు పైగా ఆ పరీక్ష నిర్వహించారు. ఆ తర్వాత స్టార్‌షిప్ రాకెట్.. హిందూ మహాసముద్రంలో దిగింది. అయితే ప్లాన్ ప్రకారమే ఆ స్టార్‌షిప్‌ను సముద్రంలో పేల్చారు. ఈ పరీక్ష ద్వారా చాలా వరకు టెస్ట్ ఫ్లయిట్ లక్ష్యాలను అందుకున్నట్లు స్పేస్ఎక్స్ కంపెనీ తెలిపింది. రాకెట్ ఇంజిన్‌లో కొన్ని సమస్యలు వచ్చినట్లు గుర్తించారు. రాకెట్ బూస్టర్‌ను రికవరీ చేయలేదన్నారు.
సముద్రంపై తమ రాకెట్ దిగినట్లు ఎక్స్ అకౌంట్లో ఆ కంపెనీ ప్రకటించింది. టెస్ట్ ఫ్లయిట్లో భాగంగా సుమారు 22 మాక్ శాటిలైట్లను కూడా స్టార్‌షిప్ రిలీజ్ చేసింది. రాకెట్‌కు చెందిన హీట్షీట్ను విశ్లేషించేందుకు ప్రత్యేకంగా ఓ శాటిలైట్ ను కూడా రిలీజ్ చేశారు. నింగిలోకి రాకెట్ ఎగిరినా.. అనుకున్న కక్ష్యలో అది వెళ్లలేదని పేర్కొన్నారు. మంటలు అంటుకునే సమయంలో ఓ ఇంజిన్ విఫలమైనట్లు తెలిసింది. రాకెట్‌కు చెందిన సూపర్ హెవీ బూస్టర్ అనుకున్నట్లు పర్ఫార్మ్ చేయలేదన్నారు. ఆ బూస్టర్ గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో పడినట్లు చెబుతున్నారు.
మస్క్ తన ఎక్స్‌లో ఈ ప్రయోగంపై ప్రశంసలు కురిపించారు. అదో ఎపిక్ ఫ్లయిట్ అన్నారు. మానవాళికి సంబంధించిన లక్ష్యాన్ని అందుకున్నట్లు తెలిపారు.
Splashdown confirmed! Congratulations to the entire SpaceX team on the twelfth flight test of Starship! pic.twitter.com/XXBAtryPpL
— SpaceX (@SpaceX) May 22, 2026
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

