న్యూయార్క్: బిలియనీర్ ఎలన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ .. 8వ సారి స్టార్‌షిప్(SpaceX Starship) మెగారాకెట్ వ్యవస్థను పరీక్షించింది. గురువారం రాత్రి జరిగిన ఆ పరీక్షలో.. స్టార్‌షిప్ రాకెట్ పేలిపోయింది. కానీ స్పేస్ఎక్స్ సంస్థ స్వల్ప లక్ష్యాలను సాధించింది. రాకెట్‌కు చెందిన బూస్టర్‌ను విజయవంతంగా లాంచ్ టవర్‌కు తీసుకురాగలిగింది. స్టార్‌షిప్ వ్యోమనౌక పేలిన దృశ్యాలు వీడియోలకు చిక్కాయి. కొందరు సముద్రం నుంచి, కొందరు విమానాల నుంచి ఆ వీడియోలు తీశాయి. ఆ వ్యోమనౌక శకలాలు బహమాస్‌లో పడినట్లు గుర్తించారు. అయితే స్టార్‌షిప్ పేలిన సమయంలో.. ఫ్లోరిడా నుంచి విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని విమానాలను నిలిపివేశారు.
దక్షిణ టెక్సాస్‌లోని స్పేస్ఎక్స్ స్టార్‌బేస్ నుంచి స్టార్‌షిప్‌ను ప్రయోగించారు. 232 అడుగుల ఎత్తైన సూపర్ హెవీ రాకెట్ బూస్టర్‌ను ఈ ప్రయోగంలో పరీక్షించారు. స్టార్‌షిప్ ఎగిరిన 20 సెకన్లకే ..స్పేస్ఎక్స్తో సంబంధాలు తెగిపోయాయి. లైవ్‌స్ట్రీమ్ జరుగుతున్న సమయంలోనే అనేక ఇంజిన్లు తెగిపోయాయి. ఇంజిన్లతో లింక్ తెగిపోవడం వల్ల.. ఆల్టిట్యూడ్ కంట్రోల్ తప్పుతుందని స్పేస్ఎక్స్ కమ్యూనికేషన్ మేనేజర్ డాన్ హౌట్ తెలిపారు. ఫ్లోరిడా, కరీబియన్ దీవుల నుంచి కూడా స్టార్‌షిప్ పేలుడు దృశ్యాలు కనిపించాయి.
Imagine not knowing about SpaceX and seeing this Starship explosion. Must be terrifying for a lot of people.
— Joe (@MundusInsanus) March 6, 2025