Space Capsule: 166 మంది అస్తికలతో అంతరిక్షంలోకి.. తిరుగు ప్రయాణంలో కూలిన స్పేస్ క్యాప్సూల్
Space Capsule: 166 మందికి చెందిన అస్తికలు, డీఎన్ఏలతో నింగిలోకి వెళ్లిన స్పేస్ క్యాప్సూల్ తిరుగు ప్రయాణంలో కూలింది. ఆ శిథిలాలు పసిఫిక్ సముద్రంలో పడ్డాయి.
టెక్సాస్: 166 మంది అస్తికలతో అంతరిక్షంలోకి వెళ్లిన ఓ స్పేస్ క్యాప్సూల్(Space Capsule) కూలింది. పసిఫిక్ సముద్రంలో పడిపోయింది. భూమి చుట్టు రెండు సార్లు విజయవంతంగా కక్ష్యలో చక్కర్లు కొట్టిన ఆ క్యాప్సూల్ ఆ తర్వాత క్రాష్ అయ్యింది. జర్మనీ స్టార్టప్ కంపెనీ ద ఎక్స్‌ప్లోరేషన్ కంపెనీ జూన్ 23వ తేదీన ఎన్వైఎక్స్ అనే క్యాప్సూల్‌ను నింగిలోకి పంపింది. మిషన్ పాజిబుల్ అనే ప్రోగ్రామ్‌లో భాగంగా దాన్ని ప్రయోగించింది. ఆ క్యాప్సూల్‌లో 166 మందికి చెందిన అస్తికలు ఉన్నాయి. టెక్సాస్‌కు చెందిన సెలిస్టిస్ అనే కంపెనీ మనుషుల అస్తికలను భూకక్ష్యలోకి పంపే ప్రాజెక్టు చేపట్టింది.
ప్రయోగంపై టెక్సాస్ కంపెనీ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. విజయవంతంగా పేలోడ్లను కక్ష్యలోకి పంపామని, లాంచర్‌తో వేరైన తర్వాత భూకక్ష్యలోకి రీఎంట్రీ ఇచ్చిందని, ఆ తర్వాత పరిస్థితులు చేజారినట్లు కంపెనీ తన ప్రకటనలో పేర్కొన్నది. తిరుగు ప్రయాణ సమయంలో సంకేతాలు తెగిపోయినట్లు చెప్పింది. ఈ సమస్యకు కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపింది. వాండెన్‌బర్గ్ స్పేస్ బేస్ నుంచి ఫాల్కన్-9 రాకెట్ ద్వారా నింగిలోకి క్యాప్సూల్‌ను పంపారు. క్యాప్సూల్‌లో ఉన్న పేలోడ్‌లో అస్తికలతో పాటు 166 మందికి చెందిన డీఎన్ఏలు ఉన్నాయి. ల్యాండింగ్ సమయంలో ఆ క్యాప్సూల్‌లోని పారాషూట్లు విఫలమైనట్లు తెలుస్తోంది. దీంతో జూన్ 24వ తేదీన క్యాప్సూల్ పసిఫిక్ సముద్రంలో కూలింది.
ద ఎక్స్‌ప్లోరేషన్ కంపెనీ కస్టమర్లకు చెందిన సుమారు 300 కేజీల పేలోడ్‌ను క్యాప్సూల్‌లో పంపింది. లింక్డిన్లో ఆ కంపెనీ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. పాక్షికంగా తమ ప్రయోగం సఫలమైనట్లు పేర్కొన్నది. సెలిస్టిస్ కంపెనీకి చెందిన పేలోడో కార్గో పేలిపోవడం ఇది రెండోసారి. 2023లో నాసా ఆట్రోనాట్ ఫిలిప్ కే చాప్మన్ అస్తికలు తీసుకెళ్తున్న వేళ రాకెట్ పేలిన విషయం తెలిసిందే. అస్తికలు కోల్పోయిన కుటుంబసభ్యలుకు సెలిస్టిస్ కంపెనీ కూడా సంతాపం ప్రకటించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

