సియోల్, డిసెంబర్ 30: దక్షిణ కొరియాకు చెందిన జేజూ ఎయిర్‌లైన్స్‌కు చెందిన మరో విమానం సోమవారం పెను ప్రమాదం నుంచి బయటపడింది. ల్యాండింగ్ గేర్ సమస్య తలెత్తడంతో సోమవారం ఉదయం జేజూ ఎయిర్‌కు చెందిన బోయింగ్ 737-800 విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికి సియోల్‌లోని గింపో అంతర్జాతీయ విమానాశ్రయానికి తిరిగి వచ్చింది.
ఈ ఘటనతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. జేజూ ఎయిర్‌కు చెందిన మరో విమానం ఆదివారం ఉదయం దక్షిణ కొరియాలోని ముఆన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ సందర్భంగా అదుపు తప్పి రక్షణ గోడను ఢీకొనడంతో 179 మంది ప్రయాణికులు మరణించారు. ఈ ఘటన జరిగి ఒక రోజు కూడా గడవక ముందే ఇదే ఎయిర్‌లైన్స్‌కు చెందిన మరో బోయింగ్‌కు సాంకేతిక సమస్య తలెత్తి గమ్యస్థానానికి చేరుకోకుండా వెనక్కు తిరిగి రావడం గమనార్హం.