మంగపేట, జనవరి 24: ములుగు జిల్లా మంగపేట మండలం వాడగూడేనికి చెందిన ఆదివాసీ యువకుడు వాసం వివేక్ సత్తాచాటాడు. దక్షిణ అమెరికాలోని ఎతైన అకోన్కాగ్వా(6,967.15మీ) పర్వతాన్ని అధిరోహించాడు. ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ వివేక్ అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. తన విజయాన్ని తెలియపరుస్తూ త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించాడు.
వివేక్‌కు పర్వతారోహణలో మెరుగైన రికార్డు ఉంది. గతంలో లడఖ్‌లోని 20 వేల అడుగుల ఎత్తున్న రెండు పర్వతాలతో పాటు 2022లో అరుణాచల్‌ప్రదేశ్‌లోని గోరిచన్(21286 అడుగులు) పర్వతాన్ని అధిరోహించాడు. ఈ క్రమంలో 2023 ఆగస్టులో రష్యాలోని ఎల్బ్రస్ పర్వతం(18350 అడుగులు), 2024 జనవరిలో లడఖ్‌లోని యుట్కంగ్రి పర్వాలు, ఆగస్టులో కంగ్యాత్సె-2 శిఖరాన్ని అధిరోహించాడు.