వాషింగ్టన్, డిసెంబర్ 27: కొంతమందికి ఉన్నట్టుండి మతిమరుపు వస్తుంటుంది. ఏందబ్బా ఎన్నడూ లేనిది ఈ మధ్య మతిమరుపు వస్తున్నదని ఆశ్చర్యపోతుంటారు. అయితే దీనికి మూలకారణం జన్యుపరమైన రూపాంతరమే అని పరిశోధకులు గుర్తించారు. వంశపారంపర్యంగా వచ్చే జన్యువుల్లో కొన్ని సందర్భాల్లో మార్పులు చోటుచేసుకుంటాయని, తద్వారా మతిమరుపు లక్షణాలు పెరుగుతుంటాయని పరిశోధకులు చెప్పారు. అయితే ఈ రూపాంతరం అందరిలో జరుగుతుందని కచ్చితంగా చెప్పలేమని పేర్కొన్నారు. కాబట్టి భయపడాల్సిన పని లేదని వివరించారు.