సియోల్: కొంతమంది పిల్లలు పెరుగుతున్న క్రమంలో అందరిలా యాక్టివ్‌గా ఉండరు. పాకడం, నిలబడడం, బోర్లాపడడం, పిలిచిన వెంటనే చూడటం వంటి లక్షణాలు కనిపించవు. దీనికి కారణం ఆటిజమ్. దీని లక్షణాలు ఏడాదిలోపు కనిపించినా నాలుగేండ్ల వరకు గుర్తించలేం. ఇప్పటివరకు దీనికి సరైన చికిత్స లేదు. ఆటిజం ఆటకట్టించే సరికొత్త చికిత్స విధానంలో దక్షిణ కొరియా పరిశోధకులు పురోగతి సాధించారు. ఆటిజానికి కారణమవుతున్న కణ నిర్దిష్ట అణు నెట్‌వర్క్‌ను గుర్తించారు. ఎలుకల్లో సీఎన్టీఎన్ఏపీ2 అనే జన్యువు డిఫెక్ట్ మాడల్‌ను ఉపయోగించి ఈ నెట్‌వర్క్‌ను కనుగొన్నారు.