అమెరికాలో హిమోత్పాతం.. గుట్టలుగా పేరుకుపోయిన మంచు
US | అమెరికాలో మంచు తుఫాను బీభత్సం సృష్టిస్తున్నది. న్యూయార్క్, బోస్టన్, ఫిలడెల్ఫియాలో ఎక్కడ చూసినా మంచు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయింది. రహదారులపై భారీగా మంచు

న్యూయార్క్: అమెరికాలో మంచు తుఫాను బీభత్సం సృష్టిస్తున్నది. న్యూయార్క్, బోస్టన్, ఫిలడెల్ఫియాలో ఎక్కడ చూసినా మంచు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయింది. రహదారులపై భారీగా మంచు జమవడంతో రవాణా వ్యవస్థ స్తంభించి పోయింది. ప్రజలు ఇండ్లలోనుంచి బయటకు రావద్దని ప్రభుత్వం హెచ్చరించింది.

మంచు తుఫాను దాటికి విద్యాస్థంలు, ప్రభుత్వ కార్యాలను ఇప్పటికే మూసివేశారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా నాలుగు వేలకుపైగా విమాన సర్వీసులను అధికారులు రద్దుచేశారు. హిమపాతం ఇంకా పెరిగే అవకాశం ఉందని అమెరికా వాతావరణ విభాగం వెల్లడించింది. దీంతో చాలా రాష్ట్రాలు అత్యవసర పరిస్థితిని ప్రకటించాయి.

రోజంతా మంచు కురుస్తుండటంతో తీరప్రాంతాల్లో 30 సెంటీమీటర్లకుపైగా మంచు పేరుకుపోయింది. మాన్హాటన్కు సమీంలో ఉన్న లాంగ్ ఐలాండ్‌లో పది అంగుళాల (25 సెంటీమీటర్లు) మేర మంచు పేరుకుపోయిందని అధికారులు వెల్లడించారు.
దీంతో రైలు పట్టాలపై మంచు ఉండటంతో రైళ్లను ఎక్కడికక్కడ నిలిపివేశామని చెప్పారు. తుఫాను బీభత్సానికి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో మసాచుసెట్స్‌లో దాదాపు 1.17 లక్షల ఇండ్లు అంధకారంలో ఉన్నాయి.

తుఫాను కారణంగా న్యూయార్క్ సిటీలో రోడ్లన్నీ మంచుతో కప్పివేయబడ్డాయి. భారీగా మంచు కురుస్తుండంతో ప్రజలెవరు ఇండ్ల నుంచి బయటకు రాకూడదని, ప్రయాణాలకు దూరంగా ఉండాలని న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ సూచించారు. ఎట్టిపరిస్థితుల్లో చెట్ల కింద నిలబడకూడదని, అవి ఏక్షణ్ణాయినా కూలిపోయే అవకాశం ఉందని హెచ్చరించారు.



Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

