టోక్యో: ఉద్యోగుల ఆరోగ్యంపై పలు సంస్థలు ప్రత్యేక శ్రద్ధ కనబర్చడం ఇటీవలి కాలంలో ఎక్కువయ్యింది. జపాన్ బ్రోకరేజీ కంపెనీ నోమురా తాజాగా జారీ చేసిన ఓ ప్రకటన నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తున్నది. ఉద్యోగులు పని వేళల్లో పొగతాగకూడదని, ఇంటి నుంచి పనిచేస్తున్న (వర్క్ ఫ్రమ్ హోం) ఉద్యోగులకు కూడా ఇది వర్తిస్తుందని ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.