న్యూయార్క్, అక్టోబర్ 23: నిత్యం మీ చేతిలో ఉండే స్మార్ట్‌ఫోన్ మీ భవిష్యత్తు ప్రమాదాన్ని పక్కాగా అంచనా వేస్తుంది. స్మార్ట్‌ఫోన్ యాక్సెలరోమీటర్ సెన్సర్లు మీ నడక ఆధారంగా రాబోయే ఐదేండ్లలో మీకు మరణం ముప్పు ఉందో లేదో చెప్పేస్తాయి.
యూఎస్‌లోని ఇల్లినాయిస్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ అద్భుతమైన ఆవిష్కరణ చేశారు. ఇందుకోసం మూవ్స్ప్రింగ్, మైఫిట్నెస్పాల్ యాప్‌లను వాడారు.