Flight Accident | రోడ్డుపై ప్రయాణిస్తున్న కారును ఓ విమానం వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. అమెరికాలోని ఫ్లోరిడాలో సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
బీచ్‌క్రాఫ్ట్ 55 మోడల్‌కు చెందిన ఫిక్స్డ్-వింగ్ విమానంలో ఇంజిన్ సమస్య తలెత్తింది. దీంతో సోమవారం రాత్రి బ్రెవర్డ్ కౌంటీ వద్ద ఇంటర్ స్టేట్ 95 జాతీయ రహదారిపై ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ విమానం ల్యాండింగ్ సమయంలో వేగాన్ని అదుపు చేసుకోలేక ఎదురుగా ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టిందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) తెలిపింది. ఈ ప్రమాదంలో విమానాన్ని నడిపిన పైలట్, అందులోని ప్రయాణికుడు సురక్షితంగా బయటపడ్డాడు. కాగా, కారు నడుపుతున్న 57 ఏళ్ల మహిళకు మాత్రం స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.
ఈ విమాన ప్రమాదానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. విమానం హైవేపై కిందకు దిగుతుండటం, ఆ సమయంలోనే రోడ్డుపై వెళ్తున్న కారును ఢీకొనడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఘటనపై ఎఫ్ఏఏ దర్యాప్తు చేపట్టింది. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు గల కారణాలను ఆరా తీస్తోంది.
WATCH: Small plane crashes into car while landing on I-95 in Brevard County, Florida pic.twitter.com/WpAFd2INs4
— BNO News Live (@BNODesk) December 9, 2025