హైదరాబాద్ : ఉక్రెయిన్పై రష్యా దాడులు(, Russia attac) నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. తాజాగా ఉక్రెయిన్పై(Ukraine) మరోసారి రష్యా విరుచుకుపడింది. ఉక్రెయిన్లోని కీవ్, ఒడెసా వంటి నగరాలతో పాటు 20 ప్రాంతాల్లో 800 డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసింది.
ఈ దాడుల్లో ఆరుగురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. రష్యా దాడుల్లో నివాస భవనాలు, మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. ఈ దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ తన రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి అంతర్జాతీయ మద్దతును కోరుతోంది.