కొలంబో: శ్రీలంకలో సైనిక హెలికాప్టర్ కూలింది(Helicopter crash). ఓ రిజర్వాయర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఆ ఘటనలో ఆరు మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మడురు ఓయా అనే సెంట్రల్ ప్రాంతంలో శ్రీలంక ఎయిర్ ఫోర్స్ దళానికి చెందిన బెల్ 212 హెలికాప్టర్ కూలినట్లు రక్షణశాఖ పేర్కొన్నది. ఆర్మీ స్పెషల్ ఫోర్సెస్ బ్రిగేడ్ పాసింగ్ ఔట్ పరేడ్‌లో ప్రదర్శనకు వెళ్తున్న సమయంలో ఈ హెలికాప్టర్ కూలినట్లు అధికారులు పేర్కొన్నారు. మృతిచెందిన వారిలో ఇద్దరు ఎయిర్ ఫోర్స్, నలుగురు ప్రత్యేక దళ సైనికాధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనపై విచారణ చేపట్టేందుకు 9 మంది సభ్యులతో శ్రీలంక వైమానిక దళం ఓ ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది.
A Bell 212 helicopter of No. 7 Sqn crashed into the Maduru Oya Reservoir during a demo for the SF passing out parade. The Commander of the AF has appointed a special nine-member committee to conduct a detailed investigation. Six personnel lost their lives following the incident. pic.twitter.com/VFzxxlB72S
— Sri Lanka Air Force (@airforcelk) May 9, 2025