సైన్ లాంగ్వేజ్ తెలుసంటూ ఉద్యోగంలో చేరి పోలీసుల పరువుతీసిన మహిళ..!
Fake sign language interpreter: ఎంతో కష్టపడి ఓ సీరియల్ కిల్లర్‌ను దొరకబట్టిన పోలీసులు.. ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఓ వైపు పోలీస్ అధికారులు మాట్లాతుండగా, మరోవైపు డెర్లిన్ రాబర్ట్ సైన్ లాంగ్వేజ్ ఇంటర్ప్రెటర్గా నటించడం

హైదరాబాద్: సైన్ లాంగ్వేజ్ ఇంటర్‌ప్రెటర్స్ అంటే సంకేత భాషా నిపుణులు, అంటే మూగవాళ్ల కోసం వినియోగంలో ఉన్న భాష (బదిరుల భాష) తెలిసిన వారు, అంటే చేతి సైగలతో సంభాషించగల వారు అని అర్థం. మూగవారికి అర్థమయ్యేలా సమాచారం ఇవ్వడం కోసం పలు విభాగాల్లో ఈ సైన్ లాంగ్వేజ్ ఇంటర్‌ప్రెటర్స్‌ను నియమించుకుంటారు. అదేవిధంగా అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోగల తంపా ఏరియా పోలీసులు కూడా తమ దగ్గరున్న క్రైమ్ సమాచారాన్ని బదిరులకు తెలియజేయడం కోసం డెర్లిన్ రాబర్ట్ అనే మహిళను సైన్ లాంగ్వేజ్ ఇంటర్ప్రెటర్గా నియమించుకున్నారు.
ఈ క్రమంలో ఎంతో కష్టపడి ఓ సీరియల్ కిల్లర్‌ను దొరకబట్టిన పోలీసులు.. ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఓ వైపు పోలీస్ అధికారులు మాట్లాతుండగా, మరోవైపు డెర్లిన్ రాబర్ట్ సైన్ లాంగ్వేజ్ ఇంటర్ప్రెటర్గా నటించడం మొదలుపెట్టింది. అధికారుల సంభాషణతో సంబంధంలేకుండా ఆమె సైగలు చేస్తుండటంతో.. నిపుణులు ఆమెకు సైన్ లాంగ్వేజ్ రాదని కనిపెట్టారు. వెంటనే పోలీసులకు విషయం తెలియజేయడంతో వారు విచారణ జరిపారు.
ఆమెకు సైన్ లాంగ్వేజ్ రాదని తెలిసి ముక్కున వేలేసుకున్నారు. పైగా ఆమెకు నేరచరిత్ర కూడా ఉన్నదని గుర్తించారు. ఒక నేరస్తురాలని ఆమె బ్యాక్ గ్రౌండ్ తెలియకుండా ఉద్యోగంలో పెట్టుకోవడమేగాక, కీలకమైన ప్రెస్మీట్లో నిలబెట్టి ఆమెతో పిచ్చి సైగలు చేయించినందుకు పోలీసుల పరువు పోయింది. దాంతో ఆమెను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. అయితే, 2017లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు మరోసారి సోషల్‌మీడియాలో మరోసారి ట్రెండ్ అవుతున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

