వాషింగ్టన్: అమెరికాలోని హడ్సన్ నదిలో హెలికాప్టర్ కూలిన ప్రమాదంలో టెక్ దిగ్గజ కంపెనీ సిమెన్స్ సీఈవో అగస్టీన్ ఎస్కోబార్ దుర్మరణం చెందారు. మన్హట్టన్-న్యూజెర్సీ మధ్యలో గురువారం మధ్యాహ్నం ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ గింగిరాలు కొడుతూ నదిలో కూలిపోయింది. అగస్టీన్ కుటుంబ సమేతంగా న్యూయార్క్ నగర పర్యటనకు వచ్చినప్పుడు ఈ ప్రమాదం జరిగింది.
ఈ దుర్ఘటనలో అగస్టీన్ భార్య, ముగ్గురు పిల్లలు, పైలట్ కూడా మృతి చెందారు. అధికారుల కథనం ప్రకారం.. నలుగురు ఘటనా స్థలిలో మృతి చెందగా, ఇద్దరు దవాఖానలో మరణించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు.