టొరంటో : కెనడాలోని టొరంటో యూనివర్సిటీలో శివాంక్ అవస్తీ (20) అనే భారత డాక్టొరల్ విద్యార్థి గుర్తు తెలియని దుండగుల కాల్పుల్లో మృతి చెందాడు. టొరంటోలోని భారత రాయబార కార్యాలయం గురువారం ఈ విషయమై ఆవేదన వ్యక్తం చేస్తూ ఎక్స్‌లో ఒక పోస్ట్ చేసింది.
మృతుడి కుటుంబానికి అవసరమైన సాయం చేస్తామని పేర్కొంది. పోలీసుల కథనం ప్రకారం స్కార్బొరొహ్ క్యాంపస్‌లోని హైలాండ్ క్రీక్ ట్రైల్, పాత కింగ్స్టన్ రోడ్ ప్రాంతంలో పట్టపగలు జరిగిన కాల్పుల్లో అవస్తీ అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొనే సరికి నిందితులు అక్కడి నుంచి పారిపోయారు.