అమెరికా ;ప్రపంచంలోనే అతి పొడవైన వ్యక్తి సుల్తాన్ కోసెన్(8 అడుగుల 2.8 అంగుళాలు), పొట్టి మహిళ జ్యోతి ఆమ్గే(2 అడుగుల 0.75 అంగుళాలు) అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన ఓ కార్యక్రమంలో సందడి చేశారు. తుర్కియేకు చెందిన సుల్తాన్, భారత్‌కు చెందిన జ్యోతి ఒక ప్రాజెక్టుపై చర్చించేందుకు కలిసినట్టు సమాచారం. మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో జన్మించిన జ్యోతి ఆమ్గే ఇటీవలనే 30వ జన్మదినాన్ని జరుపుకొన్నారు.