Harvard University | అగ్రరాజ్యం అమెరికా (America)లో మరోసారి తూటా పేలింది. ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం (Harvard University) క్యాంపస్‌లో కాల్పుల కలకలం రేగింది. సైకిల్‌పై వచ్చిన ఓ దుండగుడు మరో వ్యక్తిని లక్ష్యంగా చేసుకొని కాల్పులు (Shooting) జరిపాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటన షెర్మాన్ స్ట్రీట్ (Sherman Street)లో శుక్రవారం చోటు చేసుకుంది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తి కోసం గాలింపు చేపడుతున్నారు. అతడు సైకిల్‌పై గార్డెన్ స్ట్రీట్ (Garden Street) వైపు వెళ్లినట్లు గుర్తించారు. మరోవైపు కాల్పుల ఘటన నేపథ్యంలో విశ్వవిద్యాలయం కీలక హెచ్చరిక చేసింది. ఎవరూ బయటకి రావొద్దని సూచించింది. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
Also Read..
అమెరికన్ల వేతనాలను తగ్గిస్తున్నహెచ్1బీ వీసాలు: వైట్‌హౌస్
వెనిజువెలా సమీపంలో అమెరికా బాంబర్లు
మూన్‌లైటింగ్ ఆరోపణలు.. భారతీయుడి అరెస్ట్