Hush Money Case | న్యూయార్క్, డిసెంబర్ 17: అధ్యక్షుడికి న్యాయ రక్షణ ఉంటుందన్న కారణాన్ని చూపి హష్ మనీ కేసులో తనను దోషిగా నిర్ధారిస్తూ ఇచ్చిన తీర్పును కొట్టివేయాలంటూ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ చేసిన అభ్యర్థనను న్యాయమూర్తి తిరస్కరించారు. దీంతో ట్రంప్ భవితవ్యం సందిగ్ధంలో పడింది.
అధ్యక్షుడిగా అధికారిక చర్యలకు మాత్రమే న్యాయరక్షణ ఉంటుందని, అనధికారిక చర్యలకు కాదని మన్హట్టన్ జడ్జి జువాన్ ఎం మెర్చన్ సోమవారం స్పష్టం చేశారు. శృంగార తార స్టార్మీ డానియల్స్తో వ్యవహారం బయట పడకుండా ట్రంప్ ఆమెకు 1.10 కోట్లు ముట్టచెప్పారనేది ఆరోపణ.