దుబాయ్, మే 14: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధ్యక్షుడిగా షేక్ మహమ్మద్ బిన్ జయాద్ అల్ నహ్యాన్ నియమితులయ్యారు.
ఇప్పటి వరకు అధ్యక్షుడిగా వ్యవహరించిన ఖలీఫా బిన్ జయాద్ అల్ నహ్యాన్ శుక్రవారం మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూఏఈ పాలకులు షేక్ మహమ్మద్ బిన్ జయాద్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.