Sheik Hassina : భారత్ (India) లో తలదాచుకుంటున్న బంగ్లాదేశ్ (Bangladesh) మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheik Hasina) ను స్వదేశానికి రప్పించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. హసీనాతోపాటు 12 మందిని తమ దేశానికి తీసుకొచ్చేందుకు బంగ్లాదేశ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. వారి కోసం రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని ఇంటర్‌పోల్‌ను బంగ్లాదేశ్ నేషనల్ సెంట్రల్ బ్యూరో పోలీసులు కోరారు.
కాగా 77 ఏళ్ల షేక్ హసీనా పదవీచ్యుతురాలు అయ్యాక భారత్‌కు వచ్చి తలదాచుకుంటున్నారు. గత ఏడాది ఆగస్టు 5వ తేదీ నుంచి ఆమె భారత్‌లో ఉంటున్నారు. కోర్టుల్లో అప్పీళ్లు, దర్యాప్తు సంస్థల నివేదికల ఆధారంగా షేక్ హసీనాను స్వదేశానికి రప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నామని బంగ్లాదేశ్ అధికారులు చెప్పారు.