షాంఘై: కరోనా జీరో పాలసీలో భాగంగా చైనా ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహాలు ఆ దేశ ప్రజల్ని తీవ్ర ఇబ్బందులు పెడుతోంది. దీంతో షాంఘై ప్రజలు తిరగబడుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి షాంఘైలో కఠిన ఆంక్షలు అమలులో ఉన్న విషయం తెలిసిందే. మళ్లీ కరోనా విజృంభించడంతో అక్కడ ఆంక్షలను కఠినతం చేశారు. ఈ నేపథ్యంలో కోవిడ్ పేషెంట్లు సరెండర్ కావాలని పోలీసులు చేసిన ఆదేశాలు షాంఘైలో ఘర్షణకు దారి తీశాయి. హజ్మత్ సూట్ దుస్తుల్లో ఓ వీధికి వచ్చిన పోలీసులు.. అక్కడ ఉన్న నివాసితుల ఇండ్లను సరెండర్ చేయాలని కోరారు. ఆ సమయంలో పోలీసుల్ని స్థానికులు అడ్డుకున్నారు. ఓ కాంపౌండ్లో ఉంటున్న 39 మందిని తరలించేందుకు పోలీసులు రాగా.. ఆ సమయంలో ఘర్షణ జరిగింది. వైరస్ సోకిన రోగుల్ని అపార్ట్మెంట్లలో పెట్టేందుకు పోలీసులు ముందస్తుగా కాంపౌండ్ను ఖాళీ చేయించే ప్రయత్నం చేశారు. తమ కాంపౌండ్ను క్వారెంటైన్ కేంద్రంగా మారుస్తున్నారని ఓ వీడియోలో మహిళ అరుస్తూ కనిపించింది. ఆంక్షల వల్ల ఇప్పటికే షాంఘైలో ఆహార కొరత ఏర్పడింది. పాజిటివ్ వచ్చిన వ్యక్తిని క్వారెంటైన్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. షాంఘైలో అమలవుతున్న ఆంక్షల పట్ల ప్రజలు ఆన్లైన్లో వీడియోలు పోస్టు చేస్తున్నారు. కానీ అక్కడి ప్రభుత్వం ఎప్పటికప్పుడు వాటిని తొలగిస్తూనే ఉన్నది. కొన్ని వీడియోలు మాత్రమే కనిపిస్తున్నాయి.
Apr 14, at Naxi International Community in #Shanghai, police crackdown on and evict residents so that their homes can be used as #Quarantine site for #Covid_19 #CCPChina #CCPVirus pic.twitter.com/EdOAcB1xgG
— Jennifer Zeng 曾錚 (@jenniferatntd) April 14, 2022