న్యూయార్క్, మే 20: టెస్లా అధినేత ఎలాన్ మస్క్ 2016లో ఓ ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, అందుకు భారీ మొత్తంలో ముట్టజెప్పి నోరు మూయించారని అమెరికన్ మీడియా కోడై కూస్తున్నది. మస్క్‌పై లైంగి ఆరోపణలను కప్పిపెట్టేందుకు స్పేస్ఎక్స్ 2018లో 2.5 లక్షల డాలర్లు( రూ.2 కోట్లు) ఆమెకు చెల్లించినట్టు తెలిసింది.
ఫ్లైట్ అటెండెంట్‌గా పనిచేసిన ఆమె.. స్పేస్ ఎక్స్ కార్పొరేట్ జెట్ కాంట్రాక్ట్ ఉద్యోగి అని ఇన్సైడర్ న్యూస్ తెలిపింది. తాను ఎదుర్కొన్న వేధింపులపై బాధితురాలు కేసు నమోదు చేయటంతో, మూడో కంటికి తెలియకుండా మస్క్ ఆమెకు భారీ మొత్తంలో డబ్బిచ్చినట్టు వెల్లడించింది. దీనిపై స్పేస్ ఎక్స్ యాజమాన్యాన్ని వివరణ కోరగా స్పందించలేదు.