స్టాక్‌హోమ్, ఏప్రిల్ 27: ఆటిజం, ఏడీహెచ్‌డీ వంటి నాడీ సంబంధ రుగ్మతలతో వృషణాల క్యాన్సర్ వచ్చే ముప్పు పెరుగుతుందని స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్తలు గుర్తించారు. ఉప్సల యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో నాడీ సంబంధ రుగ్మతలకు, వృషణ క్యాన్సర్‌కు సంబంధం ఉన్నదని వెల్లడైంది.
ఈ అధ్యయన వివరాలు బ్రిటిష్ జర్నల్ ఆఫ్ క్యాన్సర్లోప్రచురితమయ్యాయి. వృషణ క్యాన్సర్ అనేది అరుదైన వ్యాధి. ఎక్కువగా 15 నుంచి 35 ఏండ్ల మధ్య వయస్కులు దీని బారిన పడతారు.