దుబాయ్: సౌదీ అరేబియా(Saudi Arabia) ఇవాళ ఇద్దరు సైనికులకు మరణశిక్ష అమలు చేసింది. యెమెన్‌తో జరిగిన యుద్ధం సమయంలో ఆ ఇద్దరూ దేశ ద్రోహానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. సౌదీ ప్రెస్ ఏజెన్సీ దీనిపై ఇవాళ ఓ ప్రకటన రిలీజ్ చేసింది. ఆ ఇద్దరు వ్యక్తుల్ని లెఫ్టినెంట్ కల్నల్స్‌గా గుర్తించారు. ఒకరు పైలెట్ కాగా, మరొకరు చీఫ్ సర్జెంట్. అయితే ఆ ఇద్దరూ ఎటువంటి నేరానికి పాల్పడ్డారో స్పష్టంగా తెలియదు. కానీ 2017లో యెమెన్ యుద్ధ సమయంలో భారీ స్థాయిలో ఆ ఇద్దరూ సైనిక నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. మరణశిక్షలో భాగంగా ఆ సైనికుల తల నరికివేసినట్లు తెలుస్తోంది.