సియోల్: ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో బహుజాతి సంస్థలు ఒక్కొక్కటిగా రష్యాలో తమ సేవలను నిలిపివేస్తున్నాయి. ఇప్పటికే యాపిల్, నైక్, ఐకియా, యూటూబ్, ఫేస్బుక్ వంటి సంస్థలు రష్యాలో తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయగా, తాజాగా సామ్సంగ్ (Samsung) కూడా ఆ జాబితాలో చేరింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశానికి ఫోన్లు, చిప్‌ల సరఫరాను నిలిపివేసినట్లు ప్రకటించింది సామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ ప్రకటించింది. పరిస్థితులను బట్టి తమ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకుంటామని స్పష్టం చేసింది. మరోవైపు యుద్ధభూమి ఉక్రెయిన్‌కు 6 మిలియన్ డాలర్ల మానవతా సాయం అందిస్తున్నట్లు వెల్లడించింది.
రష్యా హాండ్సెట్ మార్కెట్లో సామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ మొదటి స్థానంలో ఉన్నది. దేశంలో సామ్సంగ్ 30 శాతం వాటా కలిగిఉంది. తర్వాత 23 శాతంలో షావోమి, 13 శాతం వాటాతో యాపిల్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. యాపిల్‌తోపాటు నైక్, ఐకియా వంటి సంస్థలు ఇప్పటికే తమ అమ్మకాలను నిలిపివేశాయి.
కాగా, హ్యాండ్సెట్ మార్కెట్లో 44 శాతం వాటా కలిగిన చైనీస్ సంస్థలు రష్యాలో తమ కార్యకలాపాల కొనసాగింపు విషయంలో స్థబ్దుగా ఉన్నాయి. ఉక్రెయిన్‌పై దాడి విషయంలో రష్యాకు వ్యతిరేకంగా కానీ, అనుకూలంగా కానీ చైనా ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఆయా సంస్థలు తమ వాపారాలను కొనసాగిస్తున్నాయి.