Ban on Salt Bae | తన విచిత్ర చేష్టల ద్వారా సెలబ్రిటీ చెఫ్ సాల్ట్ బే వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. ఇటీవల ఫిఫా వరల్డ్ కఫ్ టోర్నమెంట్లో నిషేధానికి గురైన సాల్ట్ బే పై ఇప్పుడు ఓ సంగీత ఉత్సవ నిర్వాహకులు కూడా నిషేధం విధించారు. ఈ చెఫ్ అసలు పేరు నుస్రత్ గోక్సే. ఫిఫా వరల్డ్ కప్ సందర్భంగా సెల్ఫీ కోసం లియోనెల్ మెస్సీని బ్యాడ్జింగ్ చేసినందుకు సాల్ట్ బేను ఫైనల్ మ్యాచ్‌కు హాజరుకాకుండా ఆయన ప్రవేశంపై నిషేధం విధించారు. ఆయన తీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ అభిమానులకు కోపం తెప్పించింది. ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీని తన చేతుల్లోకి తీసుకోవడంపై కూడా విమర్శలు వచ్చాయి.
ఇప్పటికే ఎన్నో విమర్శలను ఎదుర్కొంటున్న సాల్ట్ బే.. తాజాగా తమ సంగీత ఉత్సవానికి రాకుండా రోలింగ్ లౌడ్ మ్యూజిక్ ఫెస్టివల్ ఈవెంట్ ఆర్గనైజర్స్ అనుమతి నిరాకరించారు. ఈ విషయాన్ని రోలింగ్ లౌడ్ మ్యూజిక్ ఫెస్టివల్ నిర్వాహకులు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ‘మేము రోలింగ్ లౌడ్ ఎల్ఏ 2023 నుంచి సాల్ట్ బేను మార్చి నెలలో నిషేధించాం’ అని నిర్వాహకులు ట్వీట్లో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌ను 70 వేల మంది వీక్షించగా.. దాదాపు 4,000 సార్లు రీట్వీట్ అయింది.
1983 లో జన్మించిన సాల్ట్ బే.. Nusr-Et అనే సుప్రసిద్ధ స్టీక్‌హౌస్ చైన్‌ను నిర్వహిస్తున్నాడు. ఈయనకు అమెరికా, బ్రిటన్, గ్రీస్, దుబాయ్‌లో మొత్తం 22 రెస్టారెంట్లు ఉన్నాయి. డేవిడ్ బెక్హాం, అషర్, కైలియన్ ఎంబాపే వంటి ప్రముఖులు ఈయన రెస్టారెంట్లను సందర్శిస్తుంటారు. బంగారంతో చేసిన ఓట్టోమాన్ స్టీక్‌ను సర్వ్ చేయడం ద్వారా ఆయన 2017 నుంచి లైమ్‌లైట్‌లోకి వచ్చి ప్రపంచవ్యాప్తంగా ఫేమన్ చెఫ్‌గా మారారు.