ప్యారిస్, జూన్ 21: సాధారణంగా జీతం పెంచలేదనో, బోనస్ ఎగ్గొట్టారనో, ఇంక్రిమెంట్ ఇవ్వలేదనో యాజమాన్యాలపై ఉద్యోగులు ఫిర్యాదులు చేస్తుంటారు. కానీ ఫ్రాన్స్‌లో ఒక మహిళ తనకు గత 20 ఏండ్లుగా ఎలాంటి పని చెప్పకుండా పూర్తి జీతం ఇచ్చారని, ఇలా చేయడం వివక్షేనంటూ కోర్టుకెక్కింది. దివ్యాంగురాలైన లారెన్స్ వాన్ వాసెన్‌హోవ్ దిగ్గజ టెలికాం కంపెనీ ఆరెంజ్‌లో 1993లో చేరింది. 2002 వరకు ఆమెను హెచ్ఆర్ శాఖలో సెక్రటరీగా విధులు నిర్వహించేది.
2002లో ఆమె విజ్ఞప్తి మేరకు ఫ్రాన్స్‌లోని మరో రీజియన్‌కు ఆమెను బదిలీ చేశారు. అయితే అక్కడ ఆమెకు ఎలాంటి పని అప్పగించకుండానే 20 ఏండ్ల పాటు పూర్తి జీతం, ఇతర అలవెన్స్‌లు ఇచ్చారు. అయితే 20 ఏండ్ల పాటు సంస్థ పనిచెప్పకుండా చేసిన నిర్వాకం కారణంగా తాను మానసికంగా ఎంతో వ్యధ అనుభవించానని, తోటి ఉద్యోగుల వద్ద అవమానం పొందానని, దీనిపై యాజమాన్యంపై చర్య తీసుకోవాలంటూ ఆమె కోర్టులో కేసు దాఖలు చేసింది.