మాస్కో: చంద్రుడిపై అధ్యయనం కోసం రష్యా ప్రయోగించిన మూన్ మిషన్ ‘లూనా-25’ స్పేస్‌క్రాఫ్ట్ లక్ష్యం వైపు సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతున్నది. ఈ క్రమంలో చంద్రుడి ఉపరితలానికి సంబంధించిన తొలి చిత్రాన్ని తీసి భూమికి చేరవేసింది. చంద్రుడి దక్షిణ ధ్రువానికి సంబంధించిన ప్రాంతం ఈ చిత్రం ఉన్నది. చంద్రుడికి ఆవలి వైపున ఉండే ఈ ప్రాంతం భూమి పైనుంచి కనిపించదని, ఆ ప్రాంతాన్నే ఇప్పుడు లూనా-25 స్పేస్‌క్రాఫ్ట్ ఫొటో తీసిందని శాస్త్రవేత్తలు తెలిపారు.
కాగా, గడిచిన 47 ఏళ్లలో రష్యా ప్రయోగించిన తొలి మూన్ మిషన్ లూనా-25. చంద్రుడిపై అధ్యయనం కోసమే భారత శాస్త్రవేత్తలు పంపించిన చంద్రయాన్-3 కంటే ముందే ఈ లూనా-25 స్పేస్ క్రాఫ్ట్ చందమామపై ల్యాండ్ అవుతుందని అంచనాలు వెలువడుతున్నాయి. చంద్రయాన్-3 కంటే లూనా-5 తక్కువ బరువు ఉండటం, ఇంజిన్ సామర్థ్యం ఎక్కువ ఉండటమే అందుకు కారణమని చెబుతున్నారు.