ఉక్రెయిన్‌తో యుద్ధానికి కాలుదువ్వి, బయటకు ఎలా రావాలో తెలియక సతమతమవుతున్న రష్యా.. ఇప్పుడు మరో ఇబ్బందిని ఎదుర్కొంటోంది. ఉక్రెయిన్ విషయంలో అధ్యక్షుడు పుతిన్ వ్యవహరించిన తీరుపై సైన్యంలోని ఓ వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్త ం చేస్తోంది. పుతిన్‌పై తీవ్రంగా మండిపడుతోంది. అంతేకాకుండా తిరుగుబాటు కూడా చేసింది. పేరాట్రూపర్స్ విభాగంలోని 60 మంది మెరికల్లాంటి సైనికులు పుతిన్‌పై తిరుగుబాటు చేసినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఈ వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది.
రష్యా మీడియా కథనాల ప్రకారం ఈ 60 మందిని పుతిన్ సర్కార్ జైల్లో వేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వారిని జైల్లో వేసి చిత్ర హింసలు కూడా పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఉక్రెయిన్‌పై దాడులు చేసే సమయంలో ఈ 60 మంది ఉన్నతాధికారులిచ్చిన ఆదేశాలను ఏమాత్రం పాటించలేదని, ధిక్కరించారని, అందుకే జైలు శిక్ష విధించారని అధికారులు పేర్కొంటున్నారు.
కొన్నిరిపోర్టుల ప్రకారం.. ఉక్రెయిన్‌పై యుద్ధం చేసే సమయంలో కొందర్ని బెలారూస్ పంపారు. ఈ సమయంలోనే వీరు తిరుగుబాటు చేశారని తెలుస్తోంది. దీంతో వీరందర్నీ ప్సోకోవ్కు తిరిగి పంపించేశారు. అంతేకాకుండా వారిపై తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ తిరుగుబాటు చేసిన పారట్రూపర్స్పై పిరికివాళ్లు అన్న ముద్ర వేశారు. కొందరికి జైలు శిక్ష విధించి, వారిని చిత్ర హింసలకు గురి చేస్తున్నట్లు ఆ రిపోర్టుల సారాంశం.