ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న యుద్ధం వల్ల అనేక కుటుంబాలు ఛిన్నాభిన్నమయ్యాయి. ఎవరు ఎక్కడ వుంటున్నారో కూడా తెలియని దుస్థితి. ఉక్రెయిన్పై పుతిన్ ప్రకటించిన యుద్ధం… అంతలా కుటుంబాలపై ప్రభావం చూపుతోంది. ఇప్పుడు అదే యుద్ధం పుతిన్ కుటుంబాన్ని కూడా తాకింది. ఉక్రెయిన్పై రష్యా విచక్షణా రహితంగా చేస్తున్న దాడులను పుతిన్ కుటుంబీకులే అసహ్యించుకుంటున్నట్లు అర్థమవుతోంది.
ఎలాంగటే.. పుతిన్ కూతురు మారియా వైవాహిక బంధం తెగిపోయిందని తెలుస్తోంది. ఈ విషయాన్ని డెయిలీ స్టార్ అనే మీడియా సంస్థ బయట పెట్టింది. భార్య, భర్తలిద్దరూ విడిపోయినట్లు మీడియా తన కథనంలో పేర్కొంది. పుతిన్ కూతురు మారియా వివాహం డచ్ దేశస్తుడైన జోరిట్ ఫాసెన్తో జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే వీరిద్దరూ ఏ పరిస్థితుల్లో, ఎప్పుడు విడాకులు తీసుకున్నారన్న విషయంలో మాత్రం ఇంకా స్పష్టత లేదు. కానీ… ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న దాడుల ఎఫెక్టే.. వీరిద్దరి వివాహ జీవితంపై పడిందని తెలుస్తోంది.